మహానందిలో అంగన్వాడీల రాస్తారోకో

సమస్యలు నెరవేరేంతవరకు సమ్మెను కొనసాగిస్తాం

0
TMedia (Telugu News) :

మహానందిలో అంగన్వాడీల రాస్తారోకో

– సమస్యలు నెరవేరేంతవరకు సమ్మెను కొనసాగిస్తాం

టీ మీడియా, డిసెంబర్ 22, మహానంది: రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పద కొండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు శుక్రవారం మహానందిలోని టోల్గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిరంతరం పిల్లల సంరక్షణలో ఉంటున్న అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు.తమ న్యాయ సమ్మతమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.చాలీచాలని జీతాలతో బతకడం కష్టం ఉందని, అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని,రోజుకో రూపంలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు చండీ దేవి,సావిత్రి, నారాయణమ్మ ,ఖైరున్, గౌరీ,మహేశ్వరి, పుష్పకళ, తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఉగ్రవాదుల దాడిలో ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube