అనిత కుటుంబానికి న్యాయం చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 24 వనపర్తి : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన పి.అనిత ఇంటర్ ఫెయిల్ కావడంతో ఒత్తిడికి గురై బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని యూత్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ కళాశాలల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఇంటర్ బోర్డు మరో విద్యార్థి చనిపోకుండా మినిమం మార్కులు వేసి అందర్నీ పాస్ చేయాలి విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు విద్యార్థులు ఎవరు చనిపోవద్దు పోరాడి మన హక్కులను సాధించుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు, కొల్లాపూర్ తాలూకా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి వహీద్ వివిధ మండలాల యువజన నాయకులు వల్లపు రణధీర్, మేకల అశోక్, యుగేందర్, రమేష్ ,బాలరాజు ,శివ ,శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Justice must be done Anita’s family.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube