ఆలయంలోఅన్నదానం

టీ మీడియా, మార్చి2ధర్మపురి:

0
TMedia (Telugu News) :

ఆలయంలో అన్నదానం

టీ మీడియా, మార్చి2ధర్మపురి:జగిత్యాల జిల్లాలోని, ధర్మపురి మండలం లోని, నేరేళ్ళ గ్రామంలో గల జాతీయ రహదారి నుండి, సుమారు ఆరు కీలోమీటర్ల దూరంలో గల, స్థానిక అభయ అరణ్యంలో వెలసిన పురాతన, సాంబశివ ఆలయంలో, మహా శివరాత్రి పురస్కరించుకుని, శివుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, బుధవారం రోజున, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కోద్దిరోజులుగా, గురు స్వామి అక్కినపెళ్లి బాబు కుమార్ ఆధ్వర్యంలో, శివ దీక్ష చేపట్టి నేడు ఆలయంలో, శివ దీక్ష విరమణ చేయడం జరిగింది. ఉమ్మడి ధర్మపురి మండలం లోని, అక్కపెళ్లి రాజేషుని అలయంతో పాటు, ధర్మపురి పురాతన శివాలయంతో పాటు, బుగ్గారం మండల కేంద్రంలో, శివ దీక్ష చేపట్టి శివుడికి ఘనంగా పూజ కార్యక్రమలు నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమంలో, నేరేళ్ళ గ్రామ సర్పంచ్ పలిగిరి వసుంధర సత్యం, ఎంపీటీసీ రెడ్డవేణి సత్యం, బుగ్గారం మండల కేంద్రంలో, సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ సుచెందర్, ధర్మపురి పట్టణ కేంద్రంలో, ఆలయ కమిటీ సభ్యులు, చెన్నోజి రాజేంద్రప్రసాద్, సంగి మోహన్, ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, స్వామివారి దర్శనానికి సర్వం సిద్ధం చేశారు. ఇట్టి కార్యక్రమంలో, నేరేళ్ళ శివ దీక్ష స్వాములు, గుంపుల రమేష్, కాసారపు మనోహర్ గౌడ్, గుర్రం శివకృష్ణా గౌడ్, బాసం గంగాధర్, నేతృత్వంలో స్వామివారి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సేవలు అందించారు. స్థానిక ధర్మపురి సీఐ కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్ కుమార్, ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి,చర్యలు తీసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube