అన్నమయ్య సంకీర్తనలన్నీ వెలికి తీస్తాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

0
TMedia (Telugu News) :

అన్నమయ్య సంకీర్తనలన్నీ వెలికి తీస్తాం

– టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

టీ మీడియా, ఆగస్టు 25, తిరుపతి : తాళ్ళపాక అన్నమాచార్యుల‌వారు శ్రీ వేంక‌టేశ్వర‌స్వామిని కీర్తిస్తూ ర‌చించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేల సంకీర్తనలు మాత్రమే వెలుగుచూశాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీటంన్నింటినీ స్వర పరచి ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మిగిలిన సంకీర్తనలను కూడా వెలికి తీసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అన్నమాచార్య సంకీర్తనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్వీబీసీ ద్వారా టీటీడీ రూపకల్పన చేసిన అదివో అల్లదివో కార్యక్రమ విజయోత్సవ సభ బుధవారం రాత్రి మహతి ఆడిటోరియంలో కన్నుల పండువగా జరిగింది.

 

Also Read : మెడికోని స్నేహితుడే హత్య చేశాడు

 

ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.15 – 25 ఏండ్ల వ‌య‌స్సున్న యువతీ యువకులు అన్నమయ్య సంకీర్తనలను పోటీపడి ఆలపించడం సంతోషదాయకమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నేటి తరాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం సంతోషదాయకమన్నారు. అన్నమాచార్య సంకీర్తనలలోని సంగీత, సాహిత్య, భక్తి అంశాలలోని మాధుర్యాన్ని ఇవాల్టి యువతీ, యువకులకు అందించేందుకు ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. అన్నమాచార్య సంకీర్తనలకు అర్థతాత్పర్యాలపై లోతైన విశ్లేషణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి జరుగుతున్నదని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube