అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
టీ మీడియా .జూన్ 30 ,ఖమ్మం :మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో పాత మున్సిపల్ భవనంలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నందు నూతనంగా ఎర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ రూ.5 తో మధ్యాహ్న భోజనంను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మేయర్ పునుకొల్లు నీరజ గారు ప్రారంభించారు.విజ్ఞాన భాండాగారం సిటీ లైబ్రరీ కు వచ్చే నిరుద్యోగులు, పేద విద్యార్థుల సౌకర్యార్థం రూ.5 భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ నోటిఫికేషన్ నేపథ్యంలో పేద నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున్న లైబ్రరీ కి వచ్చి చదువుకుంటున్న వారి కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం తరుపున మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ ను ఏర్పాటు చేయడంజరిగిందన్నారు.

 

Also Read : విద్యార్థులకు సామాగ్రిని అందజేసిన స్వచ్ఛంద సంస్థ

 

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.త‌మ ఆక‌లి తీర్చేందుకు ప్ర‌భుత్వం తరుపున రూ.5 క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం పట్ల నిరుద్యోగులు మంత్రి పువ్వాడను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా ముక్తార్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, లైబ్రరీ చైర్మన్ ఆశ్రీఫ్, సభ్యులు కంచర్ల దయాకర్, మేకల సుగుణా రావు, ఊర్మిళ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube