టీ మీడియా, నవంబర్ 26′ తిరుపతి అర్బన్:
తిరుపతి అన్నరావ్ సర్కిల్ ఎస్టీ కాలనీ నందు జేడి ఫౌండేషన్,
వి సపోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధిత కుటుంబాలకు సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. వరద ఉధృతిలో నష్టపోయిన సుమారు 50 మంది కుటుంబాలకు వారి సొంత నిధులతో ఆడవారికి చీరలు, మగవారికి చోక్కాలు, పంచలు,చాపలు, బెర్సిట్స్, టవల్స్,మరియు వాళ్ల పిల్లలకు స్కూల్ బ్యాగ్ లు, పుస్తకాలు, స్టేషనరీ, ప్లేట్లు , గ్లాస్ లు, అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో జేడి ఫౌండేషన్ మెంబర్ నాగలక్ష్మి, వి సపోర్టర్ సంస్థ ఫౌండర్ తహసీల్ బేగం, జాయింట్ సెక్రటరి నరేంద్రనాధ్,సభ్యులు శిరీష, షాహిన్, భరత్, భరద్వాజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.