ఐద్వా సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి
టీ మీడియా, ఫిబ్రవరి 24, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) ఆధ్వర్యంలో కే లక్ష్మి వర్ధంతి సీనియర్ నాయకురాలు సుగుణమ్మ లక్ష్మి ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. వనపర్తి జిల్లా సహాయ కార్యదర్శి సాయిలీల పూలతో నివాళులర్పించి లక్ష్మీ కుమారులు భర్త బాలకృష్ణతో వారితో ప్రేమానురాగాలు కలవారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు ఎస్వికే కేంద్రంలో ఎందరికో అమ్మలా మారి అన్నం పెట్టి అక్కున చేర్చుకున్న త్యాగశీలి లక్ష్మక్క అన్నారు.వారి ఆశయాలు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రసన్న, మమత, లావణ్య, జ్యోతి, బాలమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.