పాతగుట్ట ఆలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు
లహరి, జనవరి 31, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. వేదమంత్రాలు, భాజా భజంత్రిల నడుమ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వస్తి వాచనం అనంతరం రక్షాబంధనం, పుణ్యా వచన కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఆలయ రుత్వికులు పారాయణందారులకు ఈవో సంప్రదాయ వస్త్రాలను అందజేశారు. మొదటి పూజలో ఆలయ ఈవో ఎం గీత, భాస్కర్, పారాయణదారులు, రుత్వికులు పాల్గొన్నారు.