టీ మీడియా అక్టోబర్20,జన్నారం.
మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . జన్నారం మండలం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడుగోలి చందు మాట్లాడుతూ భారతదేశంలో వందకోట్ల మందికి కరోన టీకా పూర్తి అయిన సందర్భంగా నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు.అలాగే ప్రజలందరూ వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీకి గెలిపించాలని కోరారు.కరోన కష్టకాలంలో ఉచితగా వ్యాక్సిన్ ఇవ్వడం ఓ మోడీ వల్లనే సాధ్యం అని ,అది బిజెపి పార్టీతోనే సాధ్యమని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ కార్యదర్శి చిట్టి బాబు,మాజీ అధ్యక్షుడు విరచారి, పట్టణ అధ్యక్షులు సూర్యం,నాయకులు బద్రి నాయక్, కనకయ్య గౌడ్, సురేష్ ,ఉదయ్ కుమార్ రాజు ,తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు