ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 21 వనపర్తి : నందమూరి కుటుంబాన్ని అవమానించిన జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల చాటిన మహానుభావుడు నందమూరి తారక రామారావు కూతురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన జగన్ చర్యలకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి క్షమించమని వేడుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఇంద్ర గాంధీ, రాజీవ్ గాంధీ, మోదీ తో కలిసి దేశంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షోభాలను పరిష్కరించి ఉమ్మడి ఆంధ్ర విభజన ముఖ్యమంత్రిగా ఆంధ్ర ముఖ్యమంత్రి గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగతంగా మాట్లాడిన జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్ నాయకత్వంలో అరాచక పాలన కొనసాగిస్తూ తన బాబాయ్ హత్య కేసు గురించి రాజధాని కోసం రైతులు చేస్తున్న మహాపాదయాత్ర గురించి రాష్ట్రంలో వరదల వల్ల నష్టాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబు ఆత్మాభిమానం దెబ్బతీసేందుకు ఆయన సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. వెంటనే చంద్రబాబునాయుడు కి భువనేశ్వరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ తన ప్రవర్తన మార్చుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కుటుంబాన్ని విమర్శిస్తే తెలుగుదేశం శ్రేణులు అభిమానులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నందిమల్ల శారద, దస్తగిరి, రవి, ఆవుల శ్రీను, బాలయ్య, ఖాదర్, డి బాల్రాజ్, షారుక్, గంధం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Anointing to the NTR statue.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube