ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం

టి ఆర్ ఎస్ ప్లినరి లో సీఎం కేసీఆర్

1
TMedia (Telugu News) :

ప్రత్యాన్నమాయ ఎజెండా అవసరం
– హైదరాబాద్ వేదికగా వస్తే గర్వకారణం
-తెలంగాణ గురించి మాట్లాడిన కొత్తల్లో తిన్నది అరగట్లేదా అన్నారు
టి ఆర్ ఎస్ ప్లినరి లో సీఎం కేసీఆర్

టి మీడియా,ఎప్రిల్ 27,హైదరాబాద్:
భారత దేశాన్ని ప్రగతి పంథాలో నడిపించడానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. ప్రజలను అభ్యుదయ మార్గంలో పయనించేలా చేసే కొత్తసిద్ధాంతాలు,ప్రత్యామ్నాయ రాజకీయ అజెండాలు అని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశానికి గర్వకారణంగా నిలిచే కొత్త అజెండా, సిద్ధాంతాలు హైదరాబాద్‌ వేదికగా వస్తే అది రాష్ట్రానికే గర్వకారణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని వెల్లడించారు.దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. దేశ గతి, స్థితిని మార్చే.. ప్రజల అభివృద్ధికి సహకరించే ప్రత్యామ్నాయ అజెండా కావాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీర్ ఉద్ఘాటించారు. దేశం బాగు కోసం తెలంగాణ నుంచి అడుగులు పడితే అది రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. భారతదేశం వద్ద తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని.. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రగతి జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు.

Also Read : మాజీ ఎమ్మెల్యే తాటికి మంత్రి పరామర్శ

“భారత రాష్ట్ర సమితి భారత్ దేశంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితి కావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలని వ్యాఖ్యానించారు.

“ఆకలి కేకలెందుకు : దేశంలో అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారని కేసీఆర్ తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నారని చెప్పారు. కానీ దానికి తాను వ్యతిరేకించానని వెల్లడించారు. దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. దేశంలో మౌలిక వసతులు, అభివృద్ధిని పూర్తిస్థాయిలో కల్పించాలని అన్నారు. 44 కోట్ల పంటలు పండే భూములున్న దేశంలో ఆకలి కేకలెందుకున్నాయని ప్రశ్నించారు..

దేవుడికి దండం పెట్టి ముందడుగేశా :

“2000లో నేను తెలంగాణ గురించి మాట్లాడితే తిన్నది అరగట్లేదా అన్నారు. నేను తల్లిదండ్రులు, భగవంతుడికి దండం పెట్టి అడుగు ముందుకేశాను. ఈ 20 ఏళ్లలో మన తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. 11 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. కరోనా సమయంలో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండో సారి గెలిచాక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేలా పాలించాం. 85 శాతం మొక్కలు బతకకపోతే తెరాస వారైనా సర్పంచ్‌ పదవి పోతుందని చెప్పాం. పల్లెప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. అందువల్లే పల్లె ప్రగతిలో 1 నుంచి 10 వరకు అవార్డులు వచ్చాయి. కొన్ని వందల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రానికి ఇచ్చింది.”- కేసీఆర్, తెరాస అధినేత, ముఖ్యమంత్రి.

 

Also Read : ఇంటింటా నిరుద్యోగం.. ఇదే ఇప్ప‌టి నినాదం : రాహుల్‌

 

“రాజకీయ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ అజెండా : దేశం ఒకే లక్ష్యం దిశగా సామూహిక పయనం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.

“లక్ష్యం లేని దిశలో చీకట్లో బాణం సంధిస్తున్నామని.. క్రమశిక్షణతో, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు. సాగుకు అందుబాటులో ఉండే భూమి పరంగా చైనా కంటే భారత్ ముందుందని.. అయినా భారత్‌ను మించి ఇవాళ చైనా పైస్థాయిలో ఎందుకు ఉందని ప్రశ్నించారు.

“తెలంగాణలో ఒక జిల్లా అంతలేని ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలు కొంటున్నామన్న కేసీఆర్.. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అపారమైన జలసంపద, ఖనిజ సంపదలున్న భారతదేశం మాత్రం ప్రగతిలో ఎందుకు వెనకబడి ఉంటుందని అడిగారు. అందుకే దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించి.. ప్రజల అభ్యున్నతికి తోడ్పడే ప్రత్యామ్నాయ అజెండా రావాలని పేర్కొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube