బక్సర్‌లో పట్టాలు తప్పిన మరో రైలు
టీ మీడియా, అక్టోబర్ 17, బక్సర్: బీహార్‌లోని బక్సర్‌లో వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్సు రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళ్తుండగా బక్సర్‌లోని డమరౌన్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలు తప్పిన కోచ్‌ను అక్కడి నుంచి తరలించి, రైల్వే లైన్‌ను సరిచేయడానికి సిబ్బంది కష్టపడుతున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలను గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ నెల 11న బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.
Also Read : మంత్రి వేములను పరామర్శించిన కేటీఆర్
బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌కు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి . ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube