అంతర్జాతీయ ఐస్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ క్రీడాకారిని తాళ్లూరి నయన శ్రీ కి మధిర కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో సన్మానం
“నయన శ్రీ” ని అభినందించిన సుశీల విద్యాసంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు గారు గారు,బోయపాటి వెంకటేశ్వరరావు గారు,కరివేద సుధాకర్ గారు,గడ్డం రమేష్ గారు,తాళ్లూరి హరీష్ బాబు.
బోనకల్ మండలం ,మోటమర్రి గ్రామ వాస్తవ్యులు తాళ్లూరి నారాయణ రావు వృత్తి రిత్యా హైదరాబాద్ లో నివసిస్తున్నారు.వారి పాప తాళ్లూరి నయన శ్రీ (12 సవత్సరములు) చిన్న వయసులోనే క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళింది ఎన్నో దేశాల్లో జరిగిన ఐస్ స్పీడ్ స్కేటింగ్ లో రాణించిన నయన శ్రీ ఎన్నో మెడల్స్ ను సాధించింది కాగా ఈ ఏడాది నవంబర్ నెలలో బెలారస్ దేశంలో జరిగే అంతర్జాతీయ పోటీలలో పాల్గొనాల్సి ఉండగా ప్రాక్టీస్ చేసేందుకు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో మరియు జిల్లాలలో క్రీడా ప్రాంగణాలు మూసివేయడంతో గత మార్చి నెల నుండి సెప్టెంబర్ వరకు ఎటువంటి సాధన చేసే అవకాశం లేకపోవడంతో దీనితో తాను నిరుత్సహ పడకుండా తన కఠోర సాధనలో భాగంగా ఇంటివద్దనే సాధన చేస్తూ వారానికి ఒక రోజు ప్రతి ఆదివారం 25 కిలోమీటర్స్ నుండి ౩౦ కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తుంది అందులో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో తన సొంత గ్రామం అయిన మోటమర్రి లోనే ఉన్న నయన శ్రీ ఈ రోజు ఉదయం అక్కడ నుండి మధిర వరకు వయా కలకోట సిరిపురం మీదుగా 23 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ చేరుకుంది.ఇప్పటి వరకు 9 అంతర్జాతీయ మెడల్స్ సాధించిన ఈ చిన్నారిని భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించాలని కోరుతూ మధిర కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
