అంతిమ యాత్ర కు పలువురి సహాయం
టి మీడియా, జూన్14రామగుండం :కార్పొరేషన్ పరిధిలోని రెండోవ వార్డు పీకే రామయ్య కాలనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన పాలవేణి స్వప్న నిన్న మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించిందని స్థానికులు సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దగ్గర ఉండి స్వప్న యొక్క అంతిమ యాత్ర కార్యక్రమం చేపట్టారు.
Also Read : 10 లక్షల ఉద్యోగాలు… మోదీ కీలక ఆదేశాలు
అనంతరంమల్లేష్ మాట్లాడుతూ స్వప్న మృతి చెందిన విషయం తెలువగానే మన రామగుండం ఆడబిడ్డ పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యా రాణి గారు వచ్చి సంఘటన వివరాలు తెలుసుకొని స్వప్న పిల్లలను దగ్గరకు తీసుకొని ఓదార్చారని స్వప్న బంధువులు రావడం లేటవుతుందని సంధ్య రాణి గారికి తెల్పగా ఫిజర్ బాక్స్ ను పంపారని మరియు పసుల ప్రకాష్ గారు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారని శ్రీ ధర్మ శాస్త్ర నిత్యా అన్నదాన వేదిక కౌటం బాబన్న చనిపోయిన కుటుంబ సభ్యులకు రెండు పూటలా బోజనాలను పంపారని మడిపెల్లి మల్లేష్ తెలిపారు.
Also Read : గంజాయి మత్తు.. మెహదీపట్నంలో యువకుల వీరంగం
దుఖం లో ఉన్న స్వప్న కుటుంబానికి అండగా ఉన్న కందుల సంధ్యా రాణి గారికి .కౌటం బాబన్న.పసుల ప్రకాష్ గార్ల కు సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ బాధిత కుటుంబం తరుపున మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మా వంతుగా రెండు వేల రూపాయల నగదును అందజేశామని మడిపెల్లి మల్లేష్ తెలిపారు ఈ కార్యక్రమంలోనెలకంటి రాము. సంజీప్.హేమంత్. కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube