జేఎన్‌యూలో వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

జేఎన్‌యూలో వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

1
TMedia (Telugu News) :

జేఎన్‌యూలో వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

టీ మీడియా, డిసెంబర్ 2, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం లో మరోసారి వివాదం తలెత్తింది. వర్సటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. క్యాంపస్‌లోని రెండు, మూడు అంతస్థుల్లో ఉన్న స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ విభాగం గోడలు, పలువురు ఫ్యాకల్టీ గదుల డోర్లపై దుండగులు అభ్యంతరకరమైన రాతలు రాశారు. బ్రాహ్మణులు క్యాంప్‌సను విడిచి వెళ్లాలి, బ్రాహ్మణ్‌-బనియా మీ కోసం వస్తున్నాం.. ప్రతీకారం తీర్చుకుంటాం, బ్రాహ్మిన్‌ భారత్‌ చోడో వంటి నినాదాలను గుర్తుతెలియని వ్యక్తులు రాశారు.

Also Read : 13 వేల మంది సైనికులను కోల్పోయామన్న ఉక్రెయిన్‌

దీనిని ఖండించిన వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ శాంతిశ్రీ డీ పండిట్‌ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. ఇది లెఫ్టిస్ట్‌ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఆరోపించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube