టీమీడియా,నవంబర్,28, భద్రాచలం
హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాచలం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఎంఎస్ హాస్టల్లో 300 మంది అమ్మాయిలతో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు బి.కుసుమ అధ్యక్షత వహించారు. ఈ సెమినార్ను ఉద్దేశించి లాయర్ నర్మదా మాట్లాడారు.
మహిళలకు చాలా చట్టాలున్నాయని, వాటిని ఉపయోగించె దానిలో మహిళలు వెనక ఉన్నారన్నారు. శారీరక చట్టం, మానసిక చట్టం,ఆర్థిక చట్టం ఇలా ఎన్నో చట్టాలు ఉన్నాయని అది తెలుసుకుని మహిళలు ముందు అడుగులొ ఉండాలన్నారు.
అదేవిధంగా ఐద్వా టౌన్ కార్యదర్శి మార్ల పాటి రేణుక మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు అనగా 390 కోట్లు పైబడి ఉన్నారన్నారు. భారతదేశంలో లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ మహిళా రక్షణ సూచికలో భారత్ 133 వ స్థానంలో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్షత కొనసాగుతూనే ఉందని,ముఖ్యంగా మహిళలు ప్రశ్నించే తత్వాన్ని అవగాహన పెంపొందించుకోవాలని మహిళలకు సూచించారు.ఈ సెమినార్కు హాస్టల్ వార్డెన్ ద్వారక,ఐద్వా టౌన్ అధ్యక్షురాలు డి.సీతలక్ష్మి, ఆఫీస్ బేరర్ ఏ.సుకుబాయ్, జీవన్ జ్యోతి, సిహెచ్ రమణ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube