చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

0
TMedia (Telugu News) :

చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

టీ మీడియా, అక్టోబర్ 13, అమరావతి : అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను హైకోర్టును మంజూరు చేసింది. అంగళ్లు కేసుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో తెదేపా నేతలతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

Also Read : గ‌ర్భ‌విచ్ఛిత్తి కేసులో సుప్రీం విచార‌ణ వాయిదా

గత గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తన వాదనలను వినిపించి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు. పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి.. బెయిల్‌ను మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube