ఏలాంటి వారు అయ్యప్ప మాల ధరించాలి

ఏలాంటి వారు అయ్యప్ప మాల ధరించాలి

1
TMedia (Telugu News) :

ఏలాంటి వారు అయ్యప్ప మాల ధరించాలి

లహరి,నవంబరు 17,ఆధ్యాత్మికం : అయ్యప్ప మాల ధారణ ఎవరెవరు చేయవచ్చు? ఎవరెవరు చేయకూడదు అనే విషయం మీద పలువురికి అనేక సందేహాలు ఉంటాయి. కేరళలోని శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అసంఖ్యాక భక్తకోటి వెళుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆయనను దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆయనను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాల ధారణ చేసి వెళుతూ ఉంటారు.41 రోజుల పాటు నియమనిష్టలతో మాలధారణ చేసి ఆయన దర్శనం కోసం వెళతారు.

అయితే ఈ మాల ధారణ ఎవరెవరు చేయవచ్చు? ఎవరెవరు చేయకూడదు అనే విషయం మీద పలువురికి అనేక సందేహాలు ఉంటాయి. అయితే మేము పలు మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.సాధారణంగా మాలధారణ చేయాలి అంటే ముందుగా అయ్యప్ప మీద నమ్మకం ఉండాలి. అసలు మాలధారణకు సంబంధించిన అన్ని నియమ నిబంధనలు మాలధారణ చేయించే గురుస్వాముల నుంచి తెలుసుకోవాలి. మాలధారణకు సంబంధించిన నియమ నిబంధనలు అన్నీ తెలుసుకున్న తరువాత తాము మాలధారణ చేసి నియనిష్టలతో అయ్యప్పకు పూజ చేయగలం అనుకున్న తర్వాతే ఎవరైనా మాలధారణ చేయాలి.

Also Read : టీచర్ పై కేసు నమోదు చేయాలి

మాలధారణ చేయడానికి తల్లిదండ్రుల లేదా వివాహం జరిగితే వారి భార్య అనుమతి తప్పనిసరి. పురుషులు ఏ వయసు వారైనా మారధారణ చేయవచ్చు కానీ స్త్రీలు మాత్రం ఋతుచక్రం మొదలు కాకముందు, అది నిలిచిపోయిన తరువాత వారు మాత్రమే మాలధారణ చేయాలి. ఇక కొన్ని సందర్భాలలో మాలధారణ చేయకూడిని పరిస్థితులు కూడా పురుషులకు ఏర్పడతాయి. ఆ సందర్భాలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం.తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది కాలం వరకు మాల ధరించకూడదు. ఒకవేళ సవతి తల్లిదండ్రులు మరణిస్తే 6 నెలల వరకు మాల ధరించకూడదు. అదే భార్య మరణిస్తే 6 నెలల వరకు మాల ధరించకూడదు.

ఒకవేళ సవతి భార్య (రెండవ భార్య) మరణిస్తే 3 నెలల వరకు మాల ధరించకూడదు.పెద తండ్రులు , పినతండ్రులు , పెద్ద తల్లులు , పినతల్లులు , మరణిస్తే 3 పక్షములు అంటే (45 రోజులు) మాల ధరించకూడదు. ఇక సోదరులు , పుత్రులు , మేనత్త , మేనమామ , తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) మరణిస్తే 41 దినములు మాల ధరించకూడదు.కన్నకూతురు , కోడళ్ళు , అల్లుళ్ళు , మరదళ్ళు , వదినలు , మరుదులు , బావలు , బావమరుదులు మరణిస్తే (30) దినములు (1 నెలపాటు) మాల ధరించకూడదు. మనవళ్ళు , మనవరాళ్ళు , దాయాదులు మరణిస్తే కనుక 21 దినములు మాల ధరించకూడదు. ఇంటి పేరు గలవారు , రక్త సంబంధీకులు మరణిస్తే 21 దినములు మాల ధరించకూడదు. అలాగే వియ్యాలవారు , దూరపు బంధువులు మరణిస్తే 13 దినములు మాల ధరించకూడదు. ఆత్మీయులు , మిత్రులు మరణిస్తే 13 దినములు మాల ధరించకూడదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube