గడపగడపకు మన ప్రభుత్వం

గడపగడపకు మన ప్రభుత్వం

1
TMedia (Telugu News) :

గడపగడపకు మన ప్రభుత్వం

టీ మీడియా, జూలై 01, మహానంది : మహానంది మండల పరిధిలోని గోపవరం గ్రామంలో ఎనిమిదవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమములో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిల్పాను వైసీపీ నాయకులు, గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికారు.ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమ పధకాల గురించి ప్రజలను ఆరా తీశారు. గడప గడపకు వెళ్లి ప్రజలతో ముచ్చటించి మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పథకాల పట్ల దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆకర్షితులవుతున్నారని వారి రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితెలిపారు.

 

Also Read : చేతగాని దద్దమ్మలా కిషన్‌రెడ్డి మిగిలిపోయారు: బాల్కసుమన్‌

 

ఎమ్మెల్యే శిల్పా కు అడుగడుగునా ప్రజల నుండి నీరాజనాలు లభిస్తున్నాయి. బ్యాండు వాయిద్యాలతో హారతులతో ఎమ్మెల్యే , వైసీపీ నాయకులకు ఆహ్వానం పలుకుతున్నారు. దీంతో ఎమ్మెల్యే శిల్పా సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్, మహానందీశ్వర దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి, మండల అధ్యక్షురాలు బుడ్డా రెడ్డి యసిశ్విని, ఎంపిడిఓ సుబ్బరాజు,గోపవరం వైసిపి నాయకులు అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, పుల్లయ్య, సర్పంచి దర్శనం, గాజులపల్లి వైసీపీ నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యేకి బందోబస్తుగా మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube