ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు
– సిఫారసు చేసిన కొలీజియం
టీ మీడియా, అక్టోబర్ 11, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ జే.సుమతి, జస్టిస్ ఎస్. విజయన్ పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనికి కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించాల్సి ఉంది. సీనియర్ అడ్వొకేట్లయిన వీరికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. ఈ ప్రతిపాదనలకు సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం ఆమోదం తెలిపింది. వీరితోపాటు మరో ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు శైలేందర్ కౌర్, రవీందర్ దుదేజా ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.