మహానందిశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీ జెఏసి వైస్ చైర్మన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 12, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి మహానందిశ్వర స్వామి వారిని ఆదివారం పంచాయతీ రాజ్ మినిస్టరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, స్టేట్ ప్రెసిడెంట్ & ఏపీ జెఎసి వైస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు దర్శించుకున్నారు విరి వెంట గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పూర్ణ చంద్రా రెడ్డి, కూచిపూడి మోహన్ రావు, శామ్యూల్ పాల్, ఉన్నారు. దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహానంది మండల ఎంపీడీఓ సుబ్బ రాజు, జూనియర్ అసిస్టెంట్ హేమ శంకర్, పంచాయతీ సెక్రటరీ భాస్కర్ పాల్గొన్నారు.

AP JAC Vice Chairman
AP JAC Vice Chairman Visits Mahanandiswara Swamy.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube