కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకారం..

కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకారం..

0
TMedia (Telugu News) :

కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకారం..
టీ మీడియా ఏప్రిల్ 11,అమరావతి : రాష్ట్ర కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని పార్కింగ్‌ ప్రదేశం వద్ద వేదికను ఏర్పాటు చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు.
అనంతరం అంజాద్‌ బాషా (కడప), ఆదిమూలపు సురేశ్‌ (ఎర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాల నాయుడు(మాడుగుల)తో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమర్‌నాథ్‌ (అనకాపల్లి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : మాజీ కానిస్టేబుల్ మోసాలు -ఊద్యోగాల పేరుతో వసూళ్ళ

గుమ్మనూరు జయరామ్‌ (ఆలూరు), జోగి రమేశ్‌ (పెడన), కాకాణి గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), ఉష శ్రీచరణ్‌ (కల్యాణదుర్గం), మేరుగు నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పినిపె విశ్వరూప్‌ (అమలాపురం), పీడిక రాజన్నదొర (సాలూరు), ఆర్కే రోజా(నగరి), సీదిరి అప్పలరాజు(పలాస), తానేటి వనిత (కొవ్వూరు), విడదల రజని (చిలకలూరిపేట).. మంత్రులుగా ప్రమాణం చేశారు.అల్లా సాక్షిగా అంటూ అంజాద్ బాషా తెలుగులో ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్ఆంగ్లంలో ప్రమాణం చేశారు. దైవసాక్షిగా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ధర్మాన ప్రసాదరావు ప్రమాణం చేశారు. ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రులు… సీఎం, గవర్నర్‌లకు నమస్కారాలు చేశారు.. గుడివాడ అమర్నాథ్‌ ప్రమాణం తర్వాత సీఎంకు సాష్టాంగ నమస్కారం చేశారు. జోగి రమేశ్‌ మోకాళ్లపై కూర్చుని మరీ జగన్‌కు అభివాదం చేశారు. నారాయణ స్వామి కూడా జగన్‌కు పాదాభివందనం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube