అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయాన్ని మించిన వారు లేరు: సీఎం జగన్‌

అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయాన్ని మించిన వారు లేరు: సీఎం జగన్‌

1
TMedia (Telugu News) :

అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయాన్ని మించిన వారు లేరు: సీఎం జగన్‌
టి మీడియా,జులై15విశాఖపట్నం: నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో జరిగిన ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం కార్యక్రమంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశామని, మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని అన్నారు.

Also Read : గోదారమ్మ ఉగ్రరూపం.

మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని ప్రజలను సీఎం కోరారు.‘‘గత ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా తక్కువేనని సీఎం జగన్‌ అన్నారు. వాహన మిత్ర పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. పేద వర్గాల గురించి నిరంతరం ఆలోచిస్తున్న ప్రభుత్వం మనది. గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో ఉండేది. మన ప్రభుత్వంలో దోచుకోవడం లేదు.. పంచుకోవడం లేదు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో ఇంటింటికి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఉంది.

 

Also Read ; వరద విరుచుకుపడినా నిలబడిన కడెం

నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్టచతుష్టయంగా తయారయ్యారు. అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయం మించినవారు లేరు. నాకు ఉన్నది నిబద్ధత, నిజాయితీ, మీతోడు, దేవుడి ఆశీస్సులు’’ అని సీఎం జగన్‌ అన్నారు.
వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారని సీఎం అన్నారు. అర్హత ఉండి పథకం అందకపోతే దరఖాస్తు పెట్టుకోవాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరీకి పథకం అందిస్తామని సీఎం అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube