ఎమ్మెల్సీ కవిత క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్సీ కవిత క్షమాపణ చెప్పాలి

1
TMedia (Telugu News) :

ఎమ్మెల్సీ కవిత క్షమాపణ చెప్పాలి

 

టీ మీడియా, నవంబర్ 19, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ దగ్గర శినివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రోజు ఎంపి అరవింద్ పై దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు.మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలిస్తుందని నాయకులు గూండాలుగా వ్యవహరిస్తున్నారని ఎంపీ ఇంటిపైనే దాడులకు పాల్పడటం సిగ్గుచేటని ఎంపీ ఇంటిలో మహిళలు ఉన్నారని వారికి ఏమైనా జరిగితే టిఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలకు బిజెపి ప్రజా ప్రతినిధులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని టిఆర్ఎస్ నాయకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 

Also Read : ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులు

 

ఎమ్మెల్సీ కవిత అరవింద్ పై అనుచితంగా మాట్లాడినందుకుగాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత అరవింద్ కి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వచ్చే ఎలక్షన్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందనే భయంతో దాడులకు టిఆర్ఎస్ వాళ్ళు పాల్పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు బి.కృష్ణ, బిజెపి నాయకులు సుమిత్రమ్మ ,పద్మమ్మ, మంగమ్మ ,కవిత తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube