శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియామకం
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియామకం
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియామకం
లహరి, ఫిబ్రవరి 14, పాలకుర్తి : జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానానికి రాష్ట్రప్రభుత్వం ధర్మకర్తల మండలిని నియమించింది. ఈ సందర్భంగా మంగళవారం ధర్మకర్తల మండలి పాలక వర్గ సభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్తకంగా కలిశారు. ఆలయానికి పాలక మండలిని నియమించడంలో చొరవ చూపినందుకు గాను మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read : మకర వాహనంపై కపిలతీర్థ విభుడు
ధర్మకర్తల మండలి పాలక వర్గం..
వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వీరమల్ల జైహింద్‌ను నియమించారు. ధర్మకర్తలుగా కేసారపు మల్లారెడ్డి, చెరుకు నరేందర్, పిట్టల సైదులు, వాసూరి శ్రీశైలం, దండేపల్లి రాములు, వాసూరి ప్రమీల భిక్షు, చెరుకు ప్రభాకర్, బేత ఎల్లయ్య, పర్వతి వెంకటయ్యను నియమించారు. సలహాదారులుగా చెరుకు రాములు, వీరమల్ల బాబూరావుల నియమించడం పట్ల మంత్రిని అభినందించారు.