పదోన్నతులు పొందిన  కానిస్టేబుళ్లను అభినందించిన:సీఐ

పదోన్నతులు పొందిన  కానిస్టేబుళ్లను అభినందించిన:సీఐ

1
TMedia (Telugu News) :

పదోన్నతులు పొందిన  కానిస్టేబుళ్లను అభినందించిన:సీఐ
టీ మీడియా,మార్చి 12, రామగుండం:గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుల్స్ లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా శనివారం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ బాబు,రాజ్ కుమార్ సిబ్బంది నలుగురుకీ శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని  పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పోలీసు శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని ఈ సందర్భంగా సీఐ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు శైలజ, రమేష్, సుబ్బారావు మరియు కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : అదనపు కలెక్టర్ సంతకం ఫోర్జరీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube