రొయ్యల కొనుగోలు, ఎగుమతుల ఉంటాయి

-తప్పుడు వార్తలను నమ్మవద్దు..

1
TMedia (Telugu News) :

రొయ్యల కొనుగోలు, ఎగుమతుల ఉంటాయి

-తప్పుడు వార్తలను నమ్మవద్దు..

టీ మీడియా ,నవంబర్ 29,అమరావతి : పది రోజుల్లో రొయ్యల కొనుగోలు, ఎగుమతులు నిలిచిపోతాయన్న ప్రచారం అవాస్తవమని సి ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్‌ ఆఫ్ ఇండియా ఏపీ రీసన్ వివరణ ఇచ్చింది. అటువంటి వదంతులను ఆక్వా రైతులు నమ్మవద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించినట్లుగానే ఎగుమతులు జరుగుతాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కావాలనే కొంతమంది దళారులు వారి స్వలాభం కోసం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంది. జరుగుతున్న ప్రచారం అవాస్తమని కొట్టి పారేసింది. ఎగుమతి దారులు ప్రస్తుతంకొనుగోలు జరుగుతున్నట్లుగానే భవిష్యత్తులో కూడా యదావిదిగా కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఒకవేళ రైతులకు ఏమైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్లయితే మీ దగ్గరలోని రొయ్యలు ఎగుమతి దారులను సంప్రదించాలని కోరింది.ఇటీవల మరో 10 రోజులలో రొయ్యల కొనుగోలు నిలిపి వేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఆక్వా రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Also Read ; దళిత బంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌ లబ్ధిదారుల సంఖ్య,నిధులను, భారీగా పెంపు

కొనుగోళ్లు ఆగిపోతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. వి నేపథ్యంలో సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రీజియన్ సోషల్ మీడియా వేదికగా అలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని, అది కేవలం దళారులు తమ స్వార్థం కోసం చేస్తున్నప్రచారంగాచెబుతున్నారు.ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచిన సంగతి తెలిసిందే. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్‌ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్‌ కమిటీ సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube