బీజేపీ వాళ్లేనా.. నేనూ హిందువునే

బీజేపీ వాళ్లేనా.. నేనూ హిందువునే

0
TMedia (Telugu News) :

బీజేపీ వాళ్లేనా.. నేనూ హిందువునే

– క‌ర్నాట‌క సీఎం

టీ మీడియా, డిసెంబర్ 29, బెంగుళూరు: హిందుత్వ ఐడియాల‌జీ గురించి క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హిందుత్వ సిద్ధాంతం వేరు, హిందూ ధ‌ర్మం వేరు అని ఆయ‌న అన్నారు. బెంగుళూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. హిందువుల ఓట్ల‌ను గెలిచేందుకు హిందుత్వ ఐడియాల‌జీ రాజ‌కీయం చేశార‌న్నారు. సాఫ్ట్ హిందుత్వ‌, హార్డ్ హిందుత్వ అంటూ ఏమీ లేవ‌న్నారు. హిందుత్వ అంటే హిందుత్వ‌మే అని, నేను కూడా హిందువునే అని, హిందుత్వ వేరు, హిందూ మతం వేరు అని సీఎం సిద్దూ అన్నారు. రాముడిని తాము కూడా పూజిస్తామ‌ని, కేవ‌లం బీజేపీ వాళ్లు మాత్ర‌మే రామున్ని పూజిస్తారా, మేం రామ మందిరాల‌ను నిర్మించ‌లేదా, రామ కీర్త‌న‌ల‌ను మేం పాడ‌లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Also Read : ప్రైవేట్ ఉపాధ్యాయుల వృత్తికి ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలి

డిసెంబ‌ర్ చివ‌రి వారంలో క‌ర్నాట‌క ప్ర‌జ‌లు భ‌జ‌న‌లు పాడుతుంటార‌ని, మా గ్రామంలో జ‌రిగే ఆ భ‌జ‌న‌ల్లో పాల్గొనేవాడిన‌ని, ఈ సంప్ర‌దాయం అన్ని గ్రామాల్లో ఉండేద‌ని, కేవ‌లం బీజేపీ వాళ్లు మాత్ర‌మే హిందువులా, మేం హిందువులం కాదా అని సీఎం సిద్దూ ప్ర‌శ్నించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube