అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేసిన సీఐడీ

అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేసిన సీఐడీ

1
TMedia (Telugu News) :

అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేసిన సీఐడీ

టీ మీడియా,నవంబర్ 3, నర్సీపట్నం : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత చింతకాయ అన్నయ్యపాత్రుడితో పాటు ఆయన తనయుడు రాజేశ్‌ను అరెస్టయ్యారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెల్లవారుజామున సీఐడీ పోలీసులు సెక్షన్ సీఆర్పీసీ 50ఏ ప్రకారం.. నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు. ఇటీవల గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని, ఈ మేరకు మంగళగిరి సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపీసీ సెక్షన్‌ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడు, కుమారుడు రాజేశ్‌ను ఏలూరు కోర్టులో ఇద్దరిని హాజరు పరచనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే, సీఐడీ పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం

తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో దొంగల్లా గోడ దూకి వచ్చి, తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.తన చిన్న కొడుకు రాజేశ్‌ శబ్దాలు విని.. తలుపులు తీసి మీరెవరు ? ఏం కావాలని అడిగితే సమాధానం చెప్పకుండా అయ్యప్ప మాల వేసుకున్న రాజేశ్‌ను ఈడ్చుకొని వెళ్లిపోయారన్నారు. పోలీసులు తాగి వచ్చి దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు వచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగినా ఇవ్వలేదని, ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదని పద్మావతి అన్నారు. ప్రభుత్వం నుంచి అయ్యన్నపాత్రుడు, రాజేశ్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube