స్కూల్‌పై ఆర్మీ హెలికాప్ట‌ర్ ఫైరింగ్‌

ఏడుగురు చిన్నారులు మృతి

1
TMedia (Telugu News) :

స్కూల్‌పై ఆర్మీ హెలికాప్ట‌ర్ ఫైరింగ్‌..

-ఏడుగురు చిన్నారులు మృతి

టీ మీడియా,సెప్టెంబర్ 20,స‌గేయింగ్‌ : మ‌య‌న్మార్‌లో జుంటా సైన్యం జ‌రిపిన కాల్పుల్లో ఏడు మంది చిన్నారులు మృతి చెందారు. మ‌రో 17 మంది గాయ‌ప‌డ్డారు. ఓ స్కూల్ బిల్డింగ్‌లో రెబ‌ల్స్ త‌ల‌దాచుకున్న‌ట్లు భావించిన సైన్యం త‌మ హెలికాప్ట‌ర్ల‌తో ఆ బిల్డింగ్‌పై కాల్పులు జ‌రిపింది. దీంతో ఆ స్కూల్‌లో ఉన్న ఏడు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గ‌త ఏడాది మ‌య‌న్మార్‌లో ఆర్మీ స్థానిక ప్ర‌భుత్వాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్న విష‌యం తెలిసిందే. హెలికాప్ట‌ర్లు జ‌రిపిన కాల్పుల వ‌ల్ల కొంద‌రు పిల్ల‌లు అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచారు.

Also Read : ఇండెన్ గ్యాస్ వినియోగదారుల కు అవగాహన సదస్సు

మృత‌దేహాల‌ను ఆర్మీ త‌ర‌లించిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. స్కూల్ బిల్డింగ్‌కు బుల్లెట్ రంధ్రాలు ప‌డ్డాయి. కొన్ని చోట్ల ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయి. ఓ బౌద్ధ ఆశ్ర‌మంలో రెబ‌ల్ గ్రూపు అయిన కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీతో పాటు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆశ్ర‌యం పొందుతున్న‌ట్లు తెలిసింది. ఆకస్మిక త‌నిఖీ చేప‌ట్టిన భ‌ద్ర‌తా ద‌ళాలు ఆ స్కూల్ బిల్డింగ్‌పై దాడి చేశాయి. హెలికాప్ట‌ర్ కాల్పుల్లో కొంద‌రు గ్రామ‌స్థులు కూడా చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube