ఆర్మీ జవాన్‌ మృతి.. రాష్ట్రానికి తిరిగి వద్దామనుకున్న లోపే

ఆర్మీ జవాన్‌ మృతి.. రాష్ట్రానికి తిరిగి వద్దామనుకున్న లోపే

0
TMedia (Telugu News) :

ఆర్మీ జవాన్‌ మృతి.. రాష్ట్రానికి తిరిగి వద్దామనుకున్న లోపే

టీ మీడియా, జనవరి 2,రాజన్న సిరిసిల్ల : సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాడు. డ్యూటీలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలను ఉద్యోగం సాధించాడు. సొంత ప్రాంతంతో ఉద్యోగం రావడంతో ఎంచక్కా తిరిగి వచ్చేద్దామనుకున్నాడు. అయితే అంతలోపే మృత్యువు వెంటాడింది. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో సిరిసిల్లాకు చెందిన ఆర్మీ జవాన్‌ శివకుమార్‌ మృతి చెందాడు. సొంత ప్రాంతానికి వద్దామనుకున్న కల నెరవేరేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావు పల్లి గ్రామం చెందిన సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న చాడా శివకుమార్ (23) ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. స్థానికులు బంధువులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్ రెండేళ్ల క్రితం సిఐఎస్ఎఫ్ లో ఉద్యోగం పొందాడు. రాజస్థాన్ లోని డిలోలి 16 వ బెటాలియన్ లో డాక్యుమెంటరీ సెక్యూరిటీ గా విదులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలోనే 2023లో దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన శివకుమార్ పండుగ అనంతరం తిరిగి విధులకు వెళ్లాడు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ శిక్షణకు సమయం ఉండడంతో తిరిగి విధులకు వెళ్లాడు.

Also Read : ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య..

ఈ క్రమంలోనే డిసెంబర్ 16, 2023న ప్రమాద వశాత్తు బాత్ రూమ్‌లో పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. కోమాలోకి వెళ్లడంతో చికిత్స పొందు శివకుమార్ మృతి చెందినట్లు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.శివకుమార్ తండ్రి గోపాల్ రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందిన భాగ్యమా తల్లి గృహిణి శివకుమార్ అన్న గంగారెడ్డి సిరిసిల్లలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.. స్వగ్రామానికి మృతదేహం చేరుకున్న తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరు గా విలపిస్తున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube