యూనిఫామ్‌ల‌ను మార్చ‌నున్న ఆర్మీ

యూనిఫామ్‌ల‌ను మార్చ‌నున్న ఆర్మీ

1
TMedia (Telugu News) :

యూనిఫామ్‌ల‌ను మార్చ‌నున్న ఆర్మీ

టీ మీడియా,సెప్టెంబర్ 21, న్యూఢిల్లీ : బ్రిటీస్ కాలం నాటి విధానాల‌కు ఆర్మీ గుడ్‌బై చెప్ప‌నున్న‌ది. యూనిఫామ్‌ల‌ను, యూనిట్ పేర్ల‌ను మార్చాల‌ని ఆర్మీ భావిస్తోంది. రెజిమెంట్లు, స్వాతంత్య్రం పూర్వం నాటి బిల్డింగ్‌ల పేర్ల‌ను కూడా మార్చ‌నున్నారు. సిక్కు, గోర్ఖా, జాట్‌, రాజ్‌పుట్ లాంటి సైనిక యూనిట్ల పేర్ల‌ను మార్చాల‌ని ఆర్మీ యోచిస్తోంది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా నిర్వ‌హించే బీటింగ్ రిట్రీట్ లాంటి ఈవెంట్ల‌ను కూడా మార్చ‌నున్నారు. రోడ్లు, సంస్థ‌లు, పార్క్‌ల‌కు పెట్టిన బ్రిటీష్ క‌మాండ‌ర్ల పేర్లను కూడా ఎత్తివేయ‌నున్నారు.

Also Read : ఏసిబి వలలో బుల్లెట్ బండి అశోక్

ఇక నుంచి ఆర్మీ డే ప‌రేడ్‌ను దేశ రాజ‌ధానిలో నిర్వ‌హించ‌రు. ఆర్మీ డే ప‌రేడ్‌ను ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 15వ తేదీన నిర్వ‌హిస్తారు. ఇక నుంచి ఆ ప‌రేడ్ ఢిల్లీ కాకుండా ఇత‌ర న‌గ‌రాల్లో చేప‌ట్ట‌నున్నారు. వ‌చ్చే ఏడాది స‌ద‌ర‌న్ క‌మాండ్ ఏరియాలో ఆ ప‌రేడ్‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి. ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే మాట్లాడుతూ.. తూర్పు ల‌డాఖ్‌లోని ఎల్ఏసీ వ‌ద్ద రెండు చోట్ల ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube