మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌

మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌

1
TMedia (Telugu News) :

మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌
టీ మీడియా,మార్చ్ 31, అమరావతి: మాజీమంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‍గా ప్రకటించాలంటూ.. రోడ్డుపై ఉమా బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉమా అరెస్ట్‌ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతలను పోలీసులు చితకబాదారు.రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వర్చువల్‌గా సమావేశమై 26 జిల్లాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 70 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తారు. ఏపీలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. కుప్పం, పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అలాగే బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తిలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read : బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ స్కీం గడువు పెంపు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube