అయ్యన పాత్రుడు అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

అయ్యన పాత్రుడు అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

1
TMedia (Telugu News) :

అయ్యన పాత్రుడు అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

టీ మీడియా,నవంబర్ 3,అమరావతి : టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు – జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారు అన్నారు.గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్న, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది – జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్నకుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోంది – అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కిపైగా కేసులు పెట్టి వేధిస్తున్నారు.

Also Read : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదు – పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేస్తున్నారు – ఇలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా? – వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారు అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్‌లను వెంటనే విడుదల చేయాలిటీడీపీ అధినేత చంద్రబాబు*డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube