అరెస్టులు అమానుషం: సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా

అరెస్టులు అమానుషం: సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా

1
TMedia (Telugu News) :

అరెస్టులు అమానుషం: సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా

టీ మీడియా,మార్చి14, మణుగూరు: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం సోమవారం సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న క్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు,మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, రమ,గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఎస్ ఎల్ పద్మ లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా మణుగూరు సబ్ డివిజన్ నాయకులు ఎండీ గౌస్ అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని,ఆసరా పెన్షన్ లు ఇవ్వాలని, ఇళ్ల జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై తమ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కి పిలుపునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయించిందని ఆయన ఆరోపించారు.

Also Read : చౌదరి హోటల్ ప్రారంభించిన మేయర్,సుడా చైర్మన్

తమ నాయకుల అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని అనుకోవడం అవివేకమే అవుతుందని ఆయన అన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో పోలీసు జులుం తో తమ పోరాటాలను ఆపాలి అని అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన హితవు పలికారు. లేనిపక్షంలో రానున్న కాలంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube