ఆర్యవైశ్య సంఘం మండల కార్యవర్గ ఎన్నిక

0
TMedia (Telugu News) :

అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం,కార్యదర్శిగా నరేష్

టీ మీడియా,నవంబర్28, పినపాక:

పినపాక ఆర్యవైశ్య సంఘం సమావేశం గౌరవ అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది ఈ సమావేశంలో పినపాక మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా గాదం శెట్టి సుబ్రమణ్యం,కార్యదర్శిగా పచ్చి పులుసు నరేశ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం వీరు ప్రమాణ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్ష కార్యదర్శులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు గాదంశెట్టి సుబ్రమణ్యం పచ్చిపులుసు నరేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…మండలంలోని పేద ఆర్యవైశ్య కుటుంబాలను గుర్తించి వారి అభ్యున్నతికి పాటు పడతామన్నారు.

Aryavaishya Sangham meeting was presided over by honorary President Dosapati Venkateswara Rao at the Mandala Center on the sunday.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube