పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ విభాగం తేవాలి

పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ విభాగం తేవాలి

1
TMedia (Telugu News) :

పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ విభాగం తేవాలి

 

టీ మీడియా, అక్టోబర్ 17, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల వినతిపై పాలిటెక్ని కళాశాల సందర్శనకు వెళ్ళిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు మొత్తం పరిశీలించిన తర్వాత పాలిటెక్నిక్ కళాశాల సంఖ్య 300కు 150కి తగ్గడాన్ని ఖండిస్తూ, రాజప్రసాదం రక్షించాలని డిమాండ్ చేస్తూ, హాస్టల్లు తెరవాలని విద్యార్థులు ముక్తకంఠంతో తెలపడంతో అఖిలపక్ష ఐక్యవేదిక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులు కొద్దిమంది సోమవారం అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులను కలిసి పాలిటెక్నిక్ పరిశీలించవలసిందిగా కోరడం జరిగింది. దానితో అక్కడికి వెళ్లిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు.

Also Read : పేదలకు అండ ఎల్.ఒ.సి

విద్యార్థులను కలిసి వారితో పలు విషయాలు చర్చించి అక్కడినుండి ప్రిన్సిపాల్ తో చర్చించి, రాజప్రసాదం హాస్టల్లో సందర్శించిన తరవాత, విద్యార్థులతో మాట్లాడుతూ చాలా రోజుల కిందనే ఈ విషయంలో పోరాటం చేశామని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నాదని, రాష్ట్రంలోనే పేరెన్నిక కలిగిన వనపర్తి ప్రభుత్వ కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ లో 3 అడ్మిషన్లు కలిగి రెండవ స్థానంలో ఉన్న ఈ కాలేజీ ఇప్పుడు బిల్డింగు, హాస్టల్లు శిథిలావస్థకు చేరడంతో 150 వరకే అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థులు పాలిటెక్నిక్ సీట్లు కావాలని డిమాండ్ ఉన్న ఈ తరుణంలో నాలుగైదు కోట్లు ఖర్చుపెట్టి బిల్డింగు మరమ్మతులు చేస్తే హాస్టళ్లకు మరమ్మత్తులు చేస్తే విద్యార్థుల సంఖ్య పెంచుకోవచ్చని విద్యార్థులు, అక్కడ ఉన్న స్టాప్ తెలుపుతున్నారని, ఇప్పుడున్న కళాశాలకు, విద్యార్థినీల హాస్టల్ కు, నీటి వసతి కరువుగా ఉందని అది కూడా నెరవేర్చాలని,వేలకోట్ల అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వాలకు, భావి భారత విద్యార్థులు చదువుకోవడానికి ఐదారు కోట్లు పెట్టలేరా ఏమిటి దుస్థితి విద్యా వ్యవస్థను నష్టం చెస్తారా లేదా మీ చిత్తశుద్ధి చాటుకుని మీ అభివృద్ధిలో భాగమైన ఈ కళాశాలను కూడా రక్షించాలని, ప్రభుత్వాలను, జిల్లా కలెక్టర్ ని, కమిషనర్ నవీన్ మిట్టల్ ని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరుతున్నాము.

Also Read : గుండె మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

తదుపరి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిఠాయిని, సంబంధిత మంత్రిని, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ని అఖిలపక్ష ఐక్యవేదిక కలవడం జరుగుతుందని ఆ తరువాత నెల రోజులుగా వేచిన తర్వాత, ఇందుకు సంబంధించిన కార్యక్రమాల అమలు కాకపోతే, కార్యాచరణ అన్ని విద్యార్థి సంఘాలతో ప్రజాసంఘాలతో , కలిసి వచ్చే పార్టీలతో ఏర్పాటు చేస్తామని పైకి వేదిక ప్రకటిస్తున్నది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు వెంకటేష్, జానంపేట రాములు,మెంటపల్లి రాములు, కార్యదర్శి రమేష్, రాజనగరం రాజేష్, అడ్వకేట్ ఆంజనేయులు, వైయస్సార్ సతీష్ , కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube