అసైన్డ్ భూములతో అక్రమార్జన
-పేదల భూములపై బడాబాబుల కన్ను.
-తక్కువ ధరకు కొని వెంచర్లు..
-మోసపోతున్న పేద, మధ్య తరగతి వర్గాలు
టి మీడియా,జూన్ 24, హైదరాబాద్: నగర శివార్లలో ఇళ్ల స్థలాలకు భారీ డిమాండ్ ఉంది. ఇదే అదనుగా భావించిన రియల్టర్లు మారుమూల గ్రామాల్లోనూ వెంచర్లు వేసేస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది! పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములపై బడాబాబులు కన్నేస్తున్నారు. అతి తక్కువ ధరకు వారి నుంచి కొనుగోలు చేసి, కొన్ని భూములను కబ్జా చేసి.. ప్లాట్లు వేసి దర్జాగా అమ్మేస్తున్నారు. కాస్త తక్కువ ధరకు దొరుకుతున్నాయన్న ఆశతో పేద, మధ్యతరగతి ప్రజలు వాటిని కొని మోసపోతున్నారు. అక్రమార్కులకు ప్రజాప్రతినిధుల అండ కూడా ఉంటోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అసైన్డ్ భూముల దందా సాగుతోంది. ఇక్కడ భూములు పెద్దఎత్తున చేతులు మారుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఇళ్ల స్థలాలకు భారీ డిమాండ్ ఉంది. ఇదే అదనుగా అసైన్డ్ భూములను అక్రమంగా అమ్మేస్తున్న దళారులకు.. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు దన్నుగా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అసైన్డ్ భూముల్లో రియల్ వ్యాపారం చేసినా, కొనుగోలు చేసినా రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసేది. ఆ భూములను సర్కారీ భూములుగా ప్రకటించేది.
Also Read : స్నేహితుడి భార్యకు మత్తుమందు ఇచ్చి
ఇటీవల పెద్దఎత్తున అసైన్డ్ చట్టాల దుర్వినియోగం జరుగుతున్నా ఆ భూములను స్వాధీనం చేసుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఆక్రమణలో 600 ఎకరాలు..పటాన్చెరు మండలంలో సుమారు 2 వేల ఎకరాల భూమిని అసైన్ చేశారు. నందిగామ, కర్ధనూర్, భానూర్, ఘనపూర్ తదితర గ్రామాల్లో స్వాతంత్య్ర సమరయోఽధలు, మాజీ సైనికులు, పేదలకు ఈ భూముల్ని కేటాయించారు. అనంతర కాలంలో ఇవి ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి. కర్ధనూర్‌లో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన బడాబాబులు మామిడి, జామ తోటలను పెంచుతున్నారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు అసైన్డ్ భూముల్ని కొని మామిడి తోటలు పెంచడంతోపాటు ఫాంహౌ్‌సలు, గెస్ట్‌హౌ్‌సలు నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 600 ఎకరాల అసైన్డ్భూములు ఆక్రమణకు గురైనట్లు గతంలో రెవెన్యూ సిబ్బంది తేల్చారు. కానీ, ఒక్క ఎకరం కూడా వెనక్కి తీసుకోకపోవడం గమనార్హం.రియల్టర్ల దోపిడీ..!చిన్నకంజర్లలో వందలాది ఎకరాల్లో విస్తరించిన మామిడి తోటల్లో భారీ లే అవుట్ వేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థకు స్థలాలను అగ్రిమెంట్ చేశారని సమాచారం. అసైన్డ్‌భూముల్లో రియల్ వ్యాపారం వెనక రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక చిన్నచిన్న అసైన్డ్‌దారులు తమ భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు.
Also Read : భూఅక్రమాల కేసులు సిట్‌కు బదిలీ
వంద గజాల్లో ప్లాట్లు చేసి పేదలకు అమ్ముకుని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంద్రేశంలో భారీగా అసైన్డ్ భూమి ప్రైవేటు వ్యక్తులపరమైంది. ఇక అమీన్పూర్ మండలం అసైన్డ్ అక్రమాలకు కేరా్‌ఫగా మారింది. ఒక్క అమీన్పూర్ గ్రామంలోనే 1,500 ఎకరాల భూమిని అసైన్ చేశారు. ఆ స్థలాల్లో ప్రస్తుతం ఇళ్లను నిర్మించి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అసైనీల పేర్లే వస్తున్నాయి.ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలిరూ.వేల కోట్ల విలువైన ఈ అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి అర్హుల భూములను క్రమబద్ధీకరించాలని, అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఎన్వోసీలు లేకుండానే రిజిస్ట్రేషన్లుగుమ్మడిదల మండలంలోని గుమ్మడిదల, అన్నారంలో అసైన్డ్ భూములు భారీగా చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములను పదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో విక్రయించే వెసులుబాటు ఉంది. అయితే కలెక్టర్ ఎన్వోసీలు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. ఇక రామచంద్రాపురం మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో అసైన్డ్ భూముల అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఖరీదైన భూములను కారుచౌకగా కొట్టేసేందుకు బడాబాబులు రంగంలోకి దిగారు. కొల్లూరు 191 సర్వే నంబరులో పెద్ద ఎత్తున అనర్హులకు కేటాయింపులు జరిపారన్న వివాదం కొనసాగుతోంది.
Also Read : వీఎల్-ఎస్ఆర్ సామ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఇక ఉస్మాన్‌నగర్ సర్వే నంబరు 9లో సుమారు 74 ఎకరాల అసైన్డ్భూములను ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేశారు. మరోవైపు కొండలు, గుట్టలు, నీటి సౌలభ్యం లేని మెట్ట భూములు కేటాయించడంతో కేవలం 40 శాతం అసైన్డ్ భూముల్లోనే లబ్ధిదారులు సాగు చేసుకుంటున్నారు. ఇక జిన్నారం, పటాన్చెరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కాలుష్యం వల్ల భూములు బీడువారి సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది.పట్టా సర్వే నంబర్లలో కలిపేసి..343 సర్వే నంబరులో గతంలో స్వాతంత్య్ర సమరయోధుల పేరిట జరిగిన అసైన్డ్ భూ కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. పట్టాభూములకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూములను కలుపుకొని ప్లాట్లు అమ్ముకుంటున్నారు. పక్కనే ఉన్న పట్టా సర్వే నంబరు వేసి అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లను సృష్టించి కొనుగోలుదారులను, బ్యాంకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసైన్డ్ భూముల్లో కట్టిన ఇళ్లకు మునిసిపాలిటీ ఇంటి నంబర్లను కేటాయిస్తూ పన్ను సైతం వసూలు చేయడం గమనార్హం. నోటరీ పద్ధతిలో భూములు చేతులు మారుతున్నాయి. పరిశ్రమలకు భూ సేకరణలో భాగంగా జిన్నారం మండల పరిధిలోని సర్వే నంబరు 1లో సుమారు 130 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జంగంపేటలో హెచ్ఎండీఏ లేఅవుట్ వేయాలన్న ఆలోచనతో 140 ఎకరాల అసైన్డ్ భూమి యజమానులకు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. అలీనగర్‌లో సుమారు 7 ఎకరాల్లో ప్లాట్లు చేసి కాలనీ ఏర్పాటు చేసినా చర్యలు శూన్యం.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube