“అన్నం” లో అసాంఘికం

0
TMedia (Telugu News) :

“అన్నం” లో అసాంఘికం

-వివాదం గా మారిన మైనర్ తో ప్రేమాయణం

-మాజీ డ్రైవర్ పై మహిళ దాడి

టీ మీడియా, జనవరి 2, ఖమ్మం సిటీ బ్యూరో: మానవత్వం కు మారు పేరు అయిన తెలుగు రాష్ట్రాలలో పేరొందిన నగరం లోని “అన్నం ” ఫౌండేషన్ అనాధ ఆశ్రమము లో అసాంఘిక మైన వ్యవాహారంనడిచింది.ముఖ్యంగా మైనర్ తో ప్రేమాయణం వివాదాలు కు దారి తీసి 45 రోజులు క్రితం ఇప్పుడు రోడ్డెక్కి చర్చ నీ యాంశం అయింది.ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్నం ఆశ్రమము గురించి ఆరోపణలు చేసిన చక్రవర్థి పేర్కొన్న సెల్ నెంబర్ పనిచేయడం లేదు.ఈ నేపథ్యంలో *టి మీడియా* “అన్నం” లో అసలేమి జరిగింది అన్న కోణం లో విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.ఫౌండేషను చైర్మన్ అన్నం శ్రీనివాసరావు తోను, దాడికి గురి అయిన మాజీ డ్రైవర్ రవీందర్ విడి విడి,విడి గా *టి మీడియా* కు వివరాలు, వివరణ ఇచ్చారు. కొన్ని ఫోటోలు పంపారు.ఇద్దరి చెప్పిన దాని ప్రకారం మైనర్ తో ఫౌండేషన్ మాజీ డ్రైవర్ రవీందర్ ప్రేమాయణం సాగించాడు.ఆ విషయం బైటకు పొక్కి పోలీస్ స్టేషన్ కు వెళ్లే క్రమం లో రాజీ చర్చలు వ్యవహారం బెడిసి కొట్టింది.దాడులు వరకు వెళ్ళింది.ఈ క్రమంలో రవీందర్ సెల్ ఫోన్ ఆశ్రయం లో నే ఉండి పోయింది ఆందులోని ఫోటోలు, కాల్ లిస్ట్ ఆధారంగా అన్నం శ్రీనివాసరావు ,మైనర్ కుటుంబీకులు విచారణ చేయడం,తదితర విషయాలు సుదీర్ఘ కాలం అనంతరం పాత విషయాలు బైటకు వచ్చాయి.. ఇందులో బిసి నేత గా పేర్కొంటున్న విజయవాడ కు చెందిన అతను ఎందుకు చేరారు అన్నది తెలియాల్సి ఉంది.అతనికి ఆశ్రమము తో ఏమైనా విబేధాలు ఉన్నాయా తెలియాలి.బిసిలకుబసమధించిన అనేక విషయాలు ఉండగా ఈ ఒక్క వ్యవహారం కు పరిమితము కావడం,పనిచేయని సెల్ నెంబర్ ఇవ్వడం కు కారణాలు తెలియాల్సి ఉంది .

*టీ మీడియా* తో ఎవరేమన్నారు..

మైనర్ ను వేధించాడు;అన్నం శ్రీను

మాజీ డ్రైవర్ రవీందర్ మైనర్ ని ప్రేమ పేరుతో లైంగిక ము గా వేధించాడు. కేసు వరకు వెళ్లకుండారాజీకోరడం.అమ్మాయి కుటుంబ సభ్యులు తో మాట్లాడుకునే సందర్బంగా ఆమె తల్లి దాడి చేసింది రవీందర్ తల్లి,బంధువులు సూచన మేరకు నేను భయం చెప్పాను. అతని సెల్ లో మైనర్ ను అసభ్యముగ చూపుతూ తయారు చేసిన ఫోటోలు,ఆమె తల్లి కి చెందిన 153 వివిధ భంగిమలు ఫోటోలు లభించాయి.అతను అమ్మ అని,ప్రేమ పేరుతో వంచించిన అమ్మయి ని చెల్లి అని పిలిచే వాడు.అతను మంచి వాడు కాదు అందుకే చర్యలు..350 మంది అనాధలు ఆశ్రమము లో ఉన్నారు. వారిలో మానసిక వికలాంగులు ఉన్నారు.కొన్ని విషయాలు లో కఠినంగా ఉండటం మాకు తప్పదు.

*అన్న సార్ నా సోదరి పెళ్లికి సాయం చేసాడు:రవీందర్*
అన్నం శ్రీనివాసరావు సార్ సేవలు గొప్పవి.ఆయన అందిస్తున్న సేవ మరెవ్వరూ చెయ్యలేరు. నాది ఖమ్మం జిల్లా సుబ్లేడు,నేను ఆశ్రమము లో మైనర్ ని ప్రేమించిన విషయం వాస్తవం.కేసు పెడితే 20 ఏళ్ళు శిక్ష పడుతుంది అని రాజీ మాట్లాడుదాము అని పిలిచి అమ్మాయి తల్లి తో కొట్టించారు.నా సోదరి పెళ్లికి శ్రీనివాసరావు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చెయ్యమని కూడా 8నాటికి వచ్చి దాడి చేశారు నస్ చెయ్యి విరగొట్టారు ఆస్పత్రిలో చేరితే 13 వేలు బిల్లు అన్నం గారు చెల్లించారు అశ్రమం లో మంచి,చెడు రెండు ఉన్నాయి.ఆయనకు 16 మంది తో సాన్ని హిత్యంఉన్నది.డబ్బులు ఇచ్చిన అందరికి రసీదులు ఇవ్వరు.సుమారు 45 రోజులు క్రితం ఘటన జరిగింది.అంత సమసి పోయింది అని నేను హైదరాబాద్ వెళ్లి పోయి అక్కడ ఉన్న.మళ్ళీ నన్ను వేధింపులు కు గురి చేస్తుంటే ఇప్పుడు బైటకు రావాల్సి వచ్చింది.3 సార్లు నన్ను గంటల కొద్దీ హింసించారు అని పలు విషయాలను తెలిపారు

ఉన్నత స్థాయి విచారణ..?

అన్నం శ్రీనివాసరావు ఫౌండేషన్ పై వస్తున్న ఆరోపణలు గురించి ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్న ట్లు తెలిసింది.ఫండింగ్ కార్యకలాపాలు, సేవలు అందిస్తున్న వారు గురించి కూడా విచారణ అనేది తెలుస్తోంది.ఏది ఏమైనా షోషల్ మీడియాలో వస్తున్న వీడియో లు, ఫోటోలు ఆశ్రమం నిర్వహణ కు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube