ఆశ వర్కర్లను చిన్నచూపు చూడడం ప్రభుత్వానికి తగదు
– మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి
– ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దేవమ్మ
టీ మీడియా, అక్టోబర్ 7, పెబ్బేరు : పెబ్బేరు మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు గత 12 రోజుల నుండి ఆశ వర్కర్లు నిరవధిక సమ్మెలో భాగంగా రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ మాట్లాడుతూ సెప్టెంబరు 25నుండి మా సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నివిధాలుగా విన్నవించుకుంటున్నా కూడా ప్రభుత్వం ఉలుకూ పలుకూ లేకుండా ఉందన్నారు. ఆశా కార్యకర్తలు ప్రభుత్వ రంగంలో సేవలందిస్తున్న మహిళలము. చేస్తున్న పనిలో పుట్టెడు సమస్యలుంటే మేము విధులెలా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా కాలంలో మా కుటుంబాలను సైతం లెక్క చేయకుండా మండే ఎండలో తిరుగుతూ కరోనా బాధితులకు, స్థానిక ప్రజలకు సంపూర్ణంగా సేవలందించిన సందర్భం గుర్తు చేశారు. కరోనా జబ్బులతో క్షణక్షణం భయంభయంతో వణుకుతున్న ప్రజల ఇండ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగ పలకరించి వైద్య సహాయసహకారాలందించి ఓదార్చి ధైర్యం చెప్పి, వారికి ఎల్లవేలలా అందుబాటులో ఉంటూ తగు సలహాలు సూచనలిస్తు వారిలో ఒకరమై వాడవాడలో సహాయక సేవలందించామన్నారు. ఇట్టి మా సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : ఇజ్రాయెల్‌లో హమాస్ రాకెట్ దాడులు
అనారోగ్యంతో బాధపడుతూ కూడా విధులు నిర్వహిస్తున్నామని, గ్రామాల్లోని ప్రజలకు రోగాలొస్తే సహాయకులుగా మేమున్నాము మరి మాకు తీరని రోగాలొస్తే మాకెవరు జీవితాలకెవరు గ్యారెంటీయని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కనీస వేతనం 18వేలు చేయాలని, హెల్తు కార్డులు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, పారితోషకం లేని పనులు మాకు వద్దని, 32 రికార్డులు ప్రింట్ చేసి ఇస్తూ ఆశాలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పి కృష్ణవేణి లక్ష్మీ జ్యోతి భారతి చిన్నమ్మ నాగమణి సుకన్య రేణుక సువర్ణ లు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube