ఆశ వర్కర్ల వేతనాలపై స్పష్టత ఇవ్వాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 28 మంగపేట

క్షేత్రస్థాయిలో అందరికీ అన్ని రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్ల వేతనాలు పై ప్రభుత్వం స్వస్థత ఇవ్వకుండా ఆశల హక్కులను కాలరాస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆశ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మడే రవి ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ మేరకు మంగపేట మండలం ఆశ వర్కర్ల సమావేశం ఈ మేరకు రాజుపేట ఆశా వర్కర్ల సమావేశం లో స్వరూప అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 6000 జీతం 7500 జీవితమని మూడు నెలలు ఇచ్చిపనిని బట్టి పారితోషికం ఇస్తున్నారని అన్నారు కరోననుండి గత రెండు సంవత్సరాలుగా ప్రాణాలకు తెగించి పనిచేసిన 7500 పిక్స్డ్ వేతనం ఇవ్వకుండా ఏఎన్ఎం 5,200 రిపోర్ట్ పంపుతూనే కమిషనర్ గారు స్వయంగా రెండు వేల రూపాయలు కలిపి వేశారని అన్నారు రాష్ట్రంలో చాలా మందికి కూడా 7200 రాలేదని అన్నారు గత రెండు రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి టెలీ కాన్ఫరెన్స్ లో ఆశలకు ఇప్పటికీ 7500 జీతం ఇస్తున్నామని ఇప్పుడు 2250 పిఆర్సి కలిపి 9750 రూపాయలు ఇస్తామని అన్నారు.

అయితే పారితోషికాల జీవోను రద్దు చేయకుండా 9750 ఎలా ఇస్తారని రవి అన్నారు తక్షణమే వేతనాల జీవో విడుదల చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1800 రూపాయలు ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదని అన్నారు రోజురోజుకు పని భారం పెరుగుతుందని తక్షణమే ఆశా వర్కర్ల తో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆశలా కు హెల్త్ కార్డులు ప్రమాద బీమా ఇవ్వాలని అన్నారు లేనియెడల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని రవి ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రావ్య,సుశీల అమరావతి, విజయ కుమారి, నలిని,రాణి, రమాదేవి, లక్ష్మీ బాయి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube