అశీష్ మిట్టల్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

సి.పి.ఐ.( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ - మందుల రాజేంద్రప్రసాద్

1
TMedia (Telugu News) :

అశీష్ మిట్టల్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

సి.పి.ఐ.( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ – మందుల రాజేంద్రప్రసాద్
టి మీడియా, జూన్ 20,ఖమ్మం : అఖిలభారత రైతుకూలీ సంఘం ( ఏ.ఐ.కె.ఎం.ఎస్ ) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అశీష్ మిట్టల్ మరియు 70 మంది పై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని సి.పి.ఐ.( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సరిత క్లినిక్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది . ఈ సందర్భంగా సి.పి.ఐ ( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ , డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు . కేంద్ర ప్రభుత్వం తీసుక వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై దేశంలో వున్న అన్ని రైతు సంఘాలను ఐక్యం చేసి పోరాడి , నల్ల చట్టాలను రద్దుచేసునే తరహాలో ఉద్యమానికి కీలక పాత్ర పోషించిన అశీష్ మిట్టల్ మరియు 70 మందిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజద్రోహం , దేశద్రహం కేసులు బనాయించడం దుర్మార్గం అన్నారు .

Also Read : రైతు బజారులో సోమవారం కూరగాయల ధరలు

ముస్లీం మైనారిటీ ప్రజలపై దాడులను ఖండించినందుకు , ప్రశ్నించే వారిపై ఫాసిస్టు చర్యలకు మతోన్మాద బిజెపి ప్రయత్నిస్తుందన్నారు . దేశ రక్షణ వ్యవస్థను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా , అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్మీ ధరఖాస్తుదారులపై కాల్పులను ఖండిస్తున్నామన్నారు . వెంటనే అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . ప్రజలపై , ప్రజలకు నాయకత్వం వహిస్తున్న విప్లవకారులపై అక్రమ కేసులను ఉపసంహరించుకునేవరకు ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిపిఐ ( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ నాయకులు మోహనరావు , గంగుల శ్రీను , కిన్నెర యశోద , శ్రావణి , పీ.డీ.ఎస్.యూ జిల్లా కార్యదర్శి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube