అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణ సిద్ధాంత కర్త,దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షు, కార్యదర్శులు తోకల హరీష్, కురిసేటి నాగబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జయశంకర్ చేసిన సేవల్ని కొనియాడారు.అహింసా పద్ధతుల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించిన చొరవ యువతకు ఆదర్శప్రాయమని ఆయన అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉన్నారని,ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమయ్యేదాని అన్నారు.అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన తెలంగాణ జాతిపిత గా నిలిచిపోయారని అన్నారు.జయశంకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అమ్మ సేవా సదనంలోని వృద్ధులకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాశం రామారావు,శీమకుర్తి శ్రీనివాసరావు,కలపాల శ్రీనివాసరావు,మాసాబత్తుల రాము,మేడిపల్లి కాంతారావు,కట్టా శ్రీనివాసరావు,షేక్ వలిపాషా,దాసరి శ్రీనివాసరావు,జక్కుల రాంబాబు,బండి సత్యనారాయణ, మెట్ట వెంకటేష్,బమ్మిడి మోహన్,మెట్ట నర్సింహారావు,నరాల శంకర్,ఈడా గోపీ మోహన క్రిష్ణ, బేతాళం రామరాజు,రావిక్రింది కుమార్ రాజా,నైనవరపు రాజేష్,జుజ్జూరపు రాంబాబు,కొల్లు రమేష్,రమణం సత్యనారాయణ,నార్లపాటి రాంబాబు,రవి,మాలోత్ రామారావు,అంపోలు కనకారావు,జక్కుల రాంబాబు,ఉదయరాఘవేంద్ర,పల్లెల వెంకటేశ్వరావు,దొడ్డాకుల గిరిబాబు,దాసరి శ్రీనివాసరావు,నార్లపాటి అశోక్,నూనె హనుమంతురావు,యర్రం అప్పారావు,నక్క సత్యనారాయణ,తిరుమలశెట్టి అప్పారావు,నయీమ్,తడికమళ్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

.