టీ మీడియా,డిసెంబర్,11, భద్రాచలం
గత 3 సంవత్సరాలుగా భద్రాచలం మరియు చుట్టు పక్కన గిరిజన గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం తో పాటుతో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న జెడి ఫౌండేషన్ ని అభినందించారు ఎఎస్పి అక్షాన్స్ యాదవ్ ఐపీఎస్.ఈ మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ నేతృత్వంలో ఇటీవలే నూతనంగా భాద్యత లు చేపట్టిన ఏఎస్పి ని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి కంభంపాటి సురేష్ కుమార్ చేతులమీదుగా పూలమొక్క ని బహుకరించారు.ఈ సందర్భంగా జె.డి ఫౌండేషన్ బాధ్యులు మురళి మోహన్ కుమార్ గత 3 సంవత్సరాలుగా జెడి పౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల రిపోర్టును ఏఎస్పికి అందజేశారు,ఇదే సందర్భంలో జెడి ఫౌండేషన్ చైర్మన్ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ ద్వారా అక్షాన్స్ యాదవ్ కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అక్షాన్స్ యాదవ్ మాట్లాడుతూ తప్పనిసరిగా తమ సహకారం జేడీ ఫౌండేషన్ కి అందిస్తామని,సమాజ శ్రేయస్సుకై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీఅంబికా సురేష్,కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.