నేషనల్ అండర్ 23 యువకుడికి ASP రోహిత్ రాజ్ 10,000 అందజేత……

0
TMedia (Telugu News) :

యువత చెడు మార్గంలో ప్రయాణిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక.

భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ నేషనల్ అండర్ 23 లో సెలక్ట్ అయిన కొంగా మధు నేడు పాల్వంచ ASP రోహిత్ రాజ్ గారిని కలిసి పరిస్థితిని వివరించాడు మధు ది బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామం అని ASP గారికి విన్నపించుకున్నాడు.ఈ క్రమంలో యువకుడు మధుని ASP రోహిత్ రాజ్ (ips) గారు అభినందించారు.ఈ క్రమంలో యువకుడు మధు ఖర్చుల నిమిత్తం హహృదయం తో ASP రోహిత్ రాజ్ 10,000 పదివేల రూపాయలను యువకుడు కొంగా మధు కి అందజేసి తెలంగాణ రాష్ట్రనికి సైతం పేరు తీసుకు రావాలని సుచించారు.ఈ క్రమంలో యువతకు సందేశం అందజేశారు.

సారపాక గ్రామంలో యువత చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నారని మత్తు మరియు జూదాలకు,గొడవలకు పాల్పడుతున్నారని ఇటువంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండి మంచి మార్గంలో ప్రయాణించాలని యువత మంచి మార్గంలో ప్రయాణిస్తు ఉంటే మా పోలీస్ బృందం ఇలానే సహాయ సహకారాలు అందిస్తామని లేకపోతే చెడు మార్గ దోవ పడితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తాం అని ASP రోహిత్ రాజ్ గారు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ASP గారితో పాటు బూర్గంపహాడ్ SI సముద్రాల జితేందర్ ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube