అసైన్డ భూముల్లో ప్రభుత్వ ప్లాట్లు
టీ -మంచుకొండలో 200ఎకరాల్లో భారీ వెంచర్‌కు రంగం సిద్దం
-ల్యాండ్ పూలింగ్‌కు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
టీ మీడియా,మార్చి 16,రఘునాథపాలెం : అసైన్డ భూముల్లో ప్రభుత్వమే వెంచర్ చేసి ప్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో భూమిని సేకరించి అసైన్డ భూమిని వెంచర్‌గా అభివృద్ధి చేసి సుడా ఆధ్వర్యంలో లేఅవుట్ చేసి విక్రయిస్తారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. అయితే ఈ వెంచర్ కోసం ఖమ్మం నగరానికి అత్యంత చేరువలో ఉన్న మంచుకొండ గ్రామాన్ని అధికారులు ఎంచుకున్నారు. మంచుకొండ గ్రామంలో సర్వేనెంబరు 338లో 200ఎకరాల అసైన్డ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించగా.. ఈభూమి వివిధ రూపాల్లో 100మంది రైతుల చేతుల్లో ఉంది. దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు రెవెన్యూ అధికారులు గతంలో రైతులతో ల్యాండ్‌పూలింగ్ గురించి చర్చించారు.
Also Read : బీజేపీ జాతీయ నాయకత్వం… తెలంగాణపై ఫోకస్ పెంచుతోందా?
భారీ వెంచర్‌తో మండలం అభివృద్ధి భారీ స్థాయిలో ఉండబోతుందని, అదేవిధంగా సామాన్యుడికి తక్కువ ధరలో అన్ని రకాల అనుమతులతో ప్లాట్ దక్కించుకునే అవకాశం వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ వెంచర్లు మంచుకొండ దాటిపోయి ఉండగా.. ప్రభుత్వ వెంచర్ ఏర్పాటు అయితే మిగతా భూములకు కూడా రెక్కలు వస్తాయని పలువురు రియల్టర్లు భావిస్తున్నారు.60-40 శాతానికే రైతుల మొగ్గురెవెన్యూ అధికారులు ల్యాండ్‌పూలింగ్ ద్వారా మంచుకొండలోని 338 సర్వేనెంబరులో 200 ఎకరాల భూమిని 100మంది రైతుల వద్ద ఉన్నట్టు గుర్తించారు. ఆ భూమిని 40సంవత్సరాలుగా సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు తప్పితే క్రయ, విక్రయాలకు వారికి అవకాశం లేదు. దీంతో ల్యాండ్‌పూలింగ్ అసైన్డరైతుల పాలిట వరంగా మారిందని పలువురు అంటున్నారు. అయితే తమకు 60శాతం వాటా ఇవ్వాలని రైతులు కోరుతుండగా.. అదే జరిగితే ప్రభుత్వానికి 40శాతం వాటాపోతుంది. దాదాపు రైతులు 60-40శాతం వాటాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు ఎలా జరుపుతారు అని పలువురు అంటున్నారు. ల్యాండ్‌పూలింగ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్మంచుకొండలో ల్యాండ్‌పూలింగ్ స్థలాన్ని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ మంగళవారం పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ నర్సింహారావు నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన.. భూమిని త్వరితగతిన రైతుల వద్ద నుంచి సేకరించాలని, వారి ప్రతిపాదనలు కూడా పరిశీలించి పూర్తినివేదిక అందించాలని సూచించారు. కలెక్టర్‌వెంట సుడా వైస్ చైర్మన ఆదర్శసురభి, ఎంపీడీవో రామకృష్ణ, ఏడీ నాగభూషణం, ఆత్మచైర్మన లక్ష్మణ్‌నాయక్, సుడా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube