రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు..
రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు..
రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు..
లహరి, మార్చి 3, ఆస్ట్రాలజీ : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు ఉండటం సరికాదని చెబుతారు. అందుకే ఇంట్లో రావి చెట్టు పెంచకూడదు. ఒక వేళ అది పెరిగితే దాన్ని పెకిలించి వేయాలని కూడా చెబుతుంటారు. ఇంట్లో రావి చెట్టు ఉండటం వల్ల, ఇంట్లో రోజురోజుకు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.
పురాణాల ప్రకారం దేవతలందరూ రావి చెట్టులోనే ఉంటారు. రావి చెట్టు మూలంలో శ్రీ విష్ణువు, కాండంలో శివుడు, ముందు భాగంలో బ్రహ్మ ఉంటారని నమ్ముతారు. సనాతన ధర్మంలో, రావి చెట్టుని దేవతల దేవుడు అని కూడా పిలుస్తారు.
రావి చెట్టుకు సంబంధించిన ప్రత్యేక విషయాలు:
వాస్తు ప్రకారం, రావి చెట్టును ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు, ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సరైనది కాదు. ఒక వేళ ఇంటి ఆవరణలో ఈ మొక్క సహజంగా పెరుగుతున్నా సరే జాగ్రత్తగా తీసేయాలని పండితులు చెబుతున్నారు.
– ఇంటి బయట రావి మొక్క పెరిగితే దాన్ని అక్కడ నుంచి తీసి అడవిలో నాటాలి. ఈ మొక్కను తొలగిస్తున్నప్పుడు, పొరపాటున దాని మూలాలను కత్తిరించవద్దని గుర్తుంచుకోండి. పురాణ గ్రంథాలలో, రావి చెట్టు బ్రహ్మ నివాసంగా నమ్ముతారు. పొరపాటున కూడా ఇంటికి తూర్పు దిశలో రావి చెట్టును నాటవద్దు, ఇది ఇంట్లో డబ్బు కొరతకు దారితీస్తుంది.
– వాస్తు ప్రకారం, రావి చెట్టును నరికివేయడం జీవితంలో అశుభాన్ని తెస్తుంది. దీనివల్ల వైవాహిక జీవితంలోనూ సమస్యలు తలెత్తుతాయి. ఇది పిల్లలకు కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, గ్రంధాల ప్రకారం, రావి చెట్టును నరికివేయడం పుణ్యలోకాల్లోని పెద్దలకు బాధను కలిగిస్తుంది.
Also Read : మీ కోరికలు నెరవేరాలంటే..
– వాస్తు శాస్త్రం ప్రకారం, రావి చెట్టు నీడ ఇంట్లోకి వస్తే, అది ఇంటి పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అనేక రకాల సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
– రావి చెట్టు ఏ ఇంట్లో ఉంటే అక్కడి ప్రజల జీవితాల్లో సంక్షోభం, గొడవలు జరుగుతాయి. అంతేకాదు రావి చెట్టు ఇంటి నిర్మాణాన్ని కూడా బలహీనం చేస్తుంది.
– రావి చెట్టు కూడా కుటుంబం , ఎదుగుదలకు మంచిది కాదు. వాస్తు ప్రకారం దీని వల్ల పిల్లలకు సమస్యలు వస్తాయి. అదే సమయంలో, కుటుంబ అభివృద్ధిలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube