కలలో ఈ వస్తువులు కనిపిస్తే..
లహరి,మార్చి4, ఆస్ట్రాలజీ : కలల శాస్త్రంలో కలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కలల శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలు కన్నప్పుడు అవి మంచి, చెడులు సంకేతాలుగా తెలుస్తోంది. అయితే ఎక్కువమంది కలలను కేవలం కలలుగా భావిస్తారు. మరికొందరు కలలలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు. కలలో కనిపించే కొన్ని అంశాలు ఆర్ధిక ప్రయోజనాలను సూచిస్తాయని తెలుసుకుందాం.
ఎటువంటి విషయాలు కలలలో కనిపిస్తే.. డబ్బులు లాభాలంటే..
ఎవరి కలలోనైనా దేవత కనిపిస్తే, త్వరలో వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం, దేవుళ్ళు, దేవతలను కలలో చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇటువంటి కలలు మీ జీవితంలో త్వరలో ఆనందం రాబోతుందని ముందుగా చూస్తున్నాయని అర్ధం.
ఎవరైనా తమ కలలో వివాహిత స్త్రీ నృత్యం చేయడాన్ని చూస్తే, మీకు ఎక్కడి నుండైనా డబ్బు వస్తుందని సంకేతం.
కలలో రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తే, అటువంటి వారికీ త్వరలో డబ్బు వస్తుందని సూచన.
Also Read : ,బస్సును ఢీకొట్టని ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
కదంబ చెట్టు కలలో కనిపిస్తే, అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కలల శాస్త్రం ప్రకారం.. ఎవరి కలలో కదం చెట్టును చూస్తే వారు త్వరలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
ఏ వ్యక్తి కలలో ఆవు పాలు పితుకుతున్నట్లు కనిపిస్తే, అది శుభసూచకంగా.. ప్రయోజనాలను పొందే సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.కలలో తామర పువ్వు , జామ చెట్టు కనిపిస్తే.. ఈ కల కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల ఇంటికి వచ్చే ఆనందం , శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుంది.