టి మీడియా, డిసెంబర్14 వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సీనియర్స్ ,జూనియర్స్ కి అన్యాయం జరగకుండా అంతర్ జిల్లాల బదిలీలు జరగాలని ఏటిఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సపక నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిరుతపల్లి 2 ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఏటిఎఫ్ మండల కార్యదర్శి పొడియం కొండబాబు అధ్యక్షతన ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. సపక నాగరాజు అధ్యక్షతన ఉపాధ్యాయులు జిఓనెంబర్ 317 సవరించాలని , అంతర్ జిల్లాల బదిలీలు పారదర్శకంగా జరగాలని ప్లకార్డ్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఏటిఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సపక నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అంతర్ జిల్లాల బదిలీలు పూర్తి పారదర్శకంగా జరగాలని ,ఎటువంటి అవకతవకలకు చోటు కల్పించొద్దని అన్నారు. బదిలీల్లో స్పౌజ్ , దివ్యంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. కన్వర్టడ్ ఆశ్రమ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పని చేస్తూ ,శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని ,వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ,సిబ్బంది పాల్గొన్నారు.