ఏటీఎంను పేల్చేశారు.. 

రూ. 11 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లారు

1
TMedia (Telugu News) :

ఏటీఎంను పేల్చేశారు..                                                                                                                                        -రూ. 11 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లారు

టీ మీడియా,సెప్టెంబర్ 7, ముంబై : ఓ ఏటీఎంను పేల్చేసేందుకు ఏకంగా జిలెటిన్ స్టిక్స్‌తో పాటు పేలుడు ప‌దార్థాల‌ను ఉప‌యోగించారు. అనంత‌రం ఏటీఎంలో దొరికిన రూ. 11 ల‌క్ష‌ల‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర స‌తారా జిల్లాలోని నాగ్‌థానే గ్రామంలో వెలుగు చూసింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 2:30 గంట‌ల స‌మ‌యంలో నాగ్‌థానే గ్రామంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర ఏటీఎంలోకి దొంగ‌లు ప్ర‌వేశించారు. ముఖాల‌కు ముసుగులు ధ‌రించిన దొంగ‌లు.. ఏటీఎం సెంట‌ర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌పై న‌ల్ల‌టి ఇంకును చ‌ల్లారు.

Also Read : ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ

ఆ త‌ర్వాత జిలెటిన్ స్టిక్స్, ఇత‌ర పేలుడు ప‌దార్థాల సాయంతో ఏటీఎంను పేల్చేశారు. ఏటీఎం పూర్తిగా ధ్వంసమైంది. దాంట్లో ఉన్న రూ. 11 ల‌క్ష‌ల న‌గ‌దును దొంగ‌లు అప‌హ‌రించారు. అయితే సీసీటీవీ కెమెరాల‌పై ఇంకు చ‌ల్ల‌డంతో.. ఆ దృశ్యాలు న‌మోదైన‌ప్ప‌టికీ స్ప‌ష్టంగా క‌నిపించ‌డం లేదు. ఇలాంటి ఘ‌ట‌నే కొద్ది రోజుల క్రితం స‌తారా జిల్లా క‌రాడ్ సిటీకి స‌మీపంలోని విద్యాన‌గ‌ర్ ఏరియాలో చోటు చేసుకుంది. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube